ఆర్మూర్: పట్టణంలోని రాం మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కొంగి మనోహర్ స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి,ప్రభాకర్,జింధం నరహరిలు రూపొందించిన అక్షరాభిషేకం,సన్మాన-ఆనందవల్లి, క్రోనాలజీ అనే కరపత్రాలను సన్మాన గ్రహీత కొంగి మనోహర్, పీఆర్టీయు (అర్బన్) అధ్యక్షులు గద్దె గంగాధర్ ల చేతులు మీదుగా ఆవిష్కరింపజేసి,చదివి వినిపించారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరిల్ రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పీఆర్టీయు అసోసియేట్ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణ్ పటేల్, కృష్ణారెడ్డి,పీడీ గంగాధర్,విశిష్ట అథితులుగా గద్దె గంగాధర్,పీఆర్టీయు (అర్బన్) అధ్యక్షులు,ఎస్వీ నర్సింహారెడ్డి అర్బన్ కార్యదర్శి,ప్రత్యేక ఆహ్వానితులుగా కాంప్లెక్స్ లక్ష్మీనర్సయ్య, రిటైర్డ్ ఎంఈవో యు.సాయన్న,దేవాంగ సంఘం అధ్యక్షులు కొంగిరాము తదితరులు పాల్గొని ఆయన సేవలను కొనియాడుతూ శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సిరిల్ రావు పీఆర్టీయు నాయకులు లక్ష్మణ్ పటేల్,గద్దె గంగాధర్ లు మాట్లాడుతూ కొంగి మనోహర్ (ఇంగ్లీష్) స్కూల్ అసిస్టెంట్ గా 29 వసంతాలుగా విద్యా రంగంలో వివిధ పాఠశాలల్లో పనిచేసి విద్యార్థుల పక్షపాతిగా విద్యార్థుల హృధిలో తల్లిదండ్రుల,గ్రామస్తులు మదిలో చిరస్మరణీయంగా గురుదేవులుగా సేవలు అందించారు.జాతి గర్వించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, విద్యార్థులను అన్ని నైపుణ్యాలతో,పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని,గ్రామస్తులను తల్లిదండ్రులను చైతన్యపరిచేవారని కొనియాడారు.
సన్మాన గ్రహీత కొంగి మనోహర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు అంటేనే నిరంతర విద్యార్థి అని తాను తెలవని విషయాలను తెలుసుకుని విద్యార్థులకు బోధించే వాడినని,తన పిల్లలు ప్రస్తుతం ఉన్నత స్థానాలలో నిలబడి వివిధ హోదాలలో స్థిరపడ్డారని,నా కృషి పట్టుదలే అందుకు కారణమని అలాగే పాఠశాల విద్యార్థులను కూడా అన్ని నైపుణ్యాలతో తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నించానని అన్నారు.ఈ కార్యక్రమ సమన్వయకర్తలుగా తెలుగు భాషోపాధ్యాయులు ప్రభాకర్,విశ్రాంత ఉపాధ్యాయులు జింధం నరహరి లు వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ఆత్మీయ బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులు, పూర్వ విద్యార్థులు,పాఠశాల విద్యార్థులు,గతంలో తనతో పాటు పనిచేసిన కొలీగ్ టీచర్స్,వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని శాలువలతో ఘనంగా సన్మానించారు.సన్మాన గ్రహీత కొంగి మనోహర్ సేవలు విద్యారంగంలో మరువలేనివని అభినందించారు.ఈ రిటైర్మెంట్ తర్వాత తాను సమాజంలో, సంఘసేవలో ప్రముఖ పాత్ర పోషించాలని,కుటుంబ సభ్యులకు సమాజానికి సేవలు అందించాలని కోరారు. తర్వాత టీచింగ్ స్టాఫ్ అందరినీ శాలువాలతో,జూట్ బ్యాగులను బహుకరిస్తూ సన్మానించారు. ఆఫీస్ సబార్డినేట్స్, వంట సిబ్బందికి నూతన వస్త్రాలను బహుకరించారు.ఆధ్యాంతం వరకు విద్యార్థినీ విద్యార్థులు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,ఆత్మీయ బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



