ఆర్మూర్ రామ్ మందిరం హైస్కూల్లో కొంగి మనోహర్ సేవలు మరువలేనివి…

ఆర్మూర్:  పట్టణంలోని రాం మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కొంగి మనోహర్ స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి,ప్రభాకర్,జింధం నరహరిలు రూపొందించిన అక్షరాభిషేకం,సన్మాన-ఆనందవల్లి, క్రోనాలజీ అనే కరపత్రాలను సన్మాన గ్రహీత కొంగి మనోహర్, పీఆర్టీయు (అర్బన్) అధ్యక్షులు గద్దె గంగాధర్ ల చేతులు మీదుగా ఆవిష్కరింపజేసి,చదివి వినిపించారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరిల్ రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పీఆర్టీయు అసోసియేట్ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణ్ పటేల్, కృష్ణారెడ్డి,పీడీ గంగాధర్,విశిష్ట అథితులుగా గద్దె గంగాధర్,పీఆర్టీయు (అర్బన్) అధ్యక్షులు,ఎస్వీ నర్సింహారెడ్డి అర్బన్ కార్యదర్శి,ప్రత్యేక ఆహ్వానితులుగా కాంప్లెక్స్ లక్ష్మీనర్సయ్య, రిటైర్డ్...