28.2 C
Hyderabad
Tuesday, September 29, 2026

ఆరోగ్య సంరక్షణ పై ప్రజలకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి:మండలం కేంద్రంలోని చౌట్‌ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రైతు వేదికలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆర్మూర్ జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్ హాజరై కార్యక్రమాలను సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని,ఎటువంటి వ్యాధులు కూడా వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణీ స్త్రీల నమోదు,ప్రభుత్వ ఆసుపత్రుల్లోప్రసవాల సంఖ్య పెంపు,వేసవి కాలంలో వడదెబ్బ నివారణ చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు.చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు వేయించడం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అంటు వ్యాధులను అరికట్టవచ్చనీ అన్నారు.ఈకార్యక్రమంలోవైద్యాధికారినీ డాక్టర్ స్పందన,ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ,పర్యవేక్షకులు స్వరూప,వైద్య సిబ్బంది,ఆశ వర్కర్లు,మహిళలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.