ఆర్మూర్ : ఆర్మూర్ లోని రాంనగర్ 5 వ తర్ప పద్మశాలి సంఘంలో ఎన్నికలు-ఏకగ్ర పట్టణంలోని రాం నగర్ 5వ తర్ప సంఘంలో దాదాపు 190 కుటుంబాలు ఉంటాయి. ఇంత పెద్ద సంఘంలో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం.ఏకగ్రీవం కావడం సంఘ సభ్యుల ఐక్యతకు నిదర్శనం.ఎన్నికల అధికారులుగా 9 మంది సీనియర్ సభ్యులు నియమించబడి 9వ తేదీన నామినేషన్ లకు నోటిఫికేషన్ ఇచ్చారు.ఈ ఎన్నికలలో అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి అనే మూడు పదవులకు మాత్రమే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.అధ్యక్ష పదవికి అంబల్ల తిరుపతి,ఆడెపు ప్రభాకర్ ప్రధాన కార్యదర్శిగా తమ్మె నరేందర్, శ్రీనివాస్,కోశాధికారి పదవికి జింధం నరహరి,క్యాతం లక్ష్మణ్ లు ఒక్కో పోస్ట్ కు రెండు నామినేషన్లు వచ్చాయి. 10 వ తేదీన ఉపసంహరణ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ నామినేషన్ వేసిన వారిని మెప్పించి,ఒప్పించి సంఘం ఐక్యతకు కృషి చేయాలని ఐకమత్యమే మహాబలమని ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎన్నికలు జరిగితే వర్గవిభేదాలు,గ్రూపు రాజకీయాలు ఏర్పడతాయని, సంఘ సభ్యుల కష్ట,సుఖాల్లో భాగస్వామ్యమై వారికి అండగా నిలిచే ఇంత పెద్ద సంఘాన్ని విచ్ఛిన్నం చేయవద్దని, కలిసి ఉంటే కలదు సుఖమని,అందరం కలిసి మెలిసి ఒక్కతాటిపై నిలబడితే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి సునీల్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన 5 వ తర్ప అధ్యక్షులు ఆడెపు ప్రభాకర్, కార్యదర్శి తమ్మె నరేందర్,కోశాధికారి క్యాతం లక్ష్మణ్ లను శాలువలు, పూలమాలలతో సత్కరించి, అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు కొక్కుల సుధాకర్,చౌకె లింగం,గుద్దేటి రమేష్,అంబల్ల శ్రీనివాస్,బొడ్డు గంగాధర్, గోనె దామోదర్, నూకల శేఖర్,వంగ వివేకానంద్,బొల్లవత్రి భూమేశ్వర్,ఆపద్ధర్మ అధ్యక్షులు సైబ సుధాకర్,ఆర్మూర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులు దాసరి సునీల్ కుమార్,చెలిమెల రాజేంధర్, కట్కం నరేందర్,మర్రి రాజేశ్వర్,వంగ ఆనంద్ కృష్ణ, గోగుర్ల నరహరి తదితరులు పాల్గొన్నారు.



