26.7 C
Hyderabad
Tuesday, September 22, 2026

ఆర్మూర్ లో “రక్షా స్వచ్చంద సేవా సంస్థ” ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్,విద్యా హైస్కూల్ ఆవరణలో రక్షా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,మట్టి గణపతుల స్పాన్సర్,ప్రాజెక్ట్ చైర్మన్ ప్రవీణ్ పవార్ ల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ వాసులకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్, కోశాధికారి గోనె శ్రీధర్,ఉపాధ్యక్షులు జింధం నరహరి లు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామన్నారు.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతుల వల్ల చెరువులు, నదులు, కాలువలలో నిమర్జనం చేసినప్పుడు వాటి తయారీలో ఉపయోగించిన జిప్సం,సల్ఫర్,మెగ్నీషియం,సీసం అనే భారం మూలకాలు,విగ్రహం అందంగా ఆకర్షణీయంగా కనబడటానికి ఉపయోగించే ఆర్సినిక్, కాడ్మియం,క్రోమియం,లెడ్ వంటి రసాయనాలు నీటిలో కరగక నీటిలో నివసించే జలచరాలకు,మొక్కలకు హాని తలపెడుతూ, ఆ మట్టిని ఉపయోగిస్తే పంటలకు నష్టం కలిగిస్తూ,ఆ నీటిని త్రాగిన మనుషులకు,జంతువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయని,మట్టి గణపతులు నీటిలో కరిగిపోయి ఆ మట్టితో నీరు శుభ్రమై జంతువుల శరీరాలను శుద్ధి చేస్తుందని, అలా బాగా మ్రగ్గిన నల్లని మట్టి (హ్యూమస్) సేంద్రియ ఎరువుగా మారిన తర్వాత వేసవిలో పంట పొలాలకు ఉపయోగిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు.

లేకపోతే మట్టి గణపతులను గణపతుల పూజా కార్యక్రమంలో ఉపయోగించిన 21 రకాల ఆకులు,చిరు ధాన్యాలను మొక్కల పాదులలో గోతి త్రవ్వి నిమజ్జనం చేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయని, పూజ కొరకు మనం ఉపయోగించిన సామాగ్రి మొక్కలకు క్రిమిసంహారక మందుగా పని చేస్తుందన్నారు.ఇట్టి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుని మున్ముందు మట్టి గణపతులనే పూజించాలని పర్యావరణాన్ని రక్షించాలని,ప్రజలను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శులు ఖాందేశ్ సత్యం,తులసీ పట్వారి,డా.బేతు గంగాధర్,కార్యవర్గ సభ్యులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.