ఆర్మూర్ లో “రక్షా స్వచ్చంద సేవా సంస్థ” ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ…

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్,విద్యా హైస్కూల్ ఆవరణలో రక్షా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,మట్టి గణపతుల స్పాన్సర్,ప్రాజెక్ట్ చైర్మన్ ప్రవీణ్ పవార్ ల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ వాసులకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్, కోశాధికారి గోనె శ్రీధర్,ఉపాధ్యక్షులు జింధం నరహరి లు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామన్నారు.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతుల వల్ల చెరువులు, నదులు, కాలువలలో నిమర్జనం చేసినప్పుడు వాటి తయారీలో ఉపయోగించిన జిప్సం,సల్ఫర్,మెగ్నీషియం,సీసం అనే భారం...