26.7 C
Hyderabad
Tuesday, September 22, 2026

దళిత స్పీకర్ పై అహంకార వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే..! ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ…

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యం లో అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ,బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సభాపతి స్థానంలో ఉన్న ఒక దళిత నాయకుడిని ఉద్దేశించి ఇష్టారీతిగా మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీకున్న దళిత వ్యతిరేక భావజాలానికి,అహంకారానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు.అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలను,రాజ్యాంగ విలువలను బీఆర్ఎస్ నేతలు కించపరుస్తున్నారని విమర్శించారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు దళిత సమాజానికి తాతా మధు,బీఆర్ఎస్ అధినాయకత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.సభాపతి గౌరవాన్ని దిగజార్చేలా అసెంబ్లీ ప్రాంగణంలో వ్యవహరించిన ఎమ్మెల్సీ తాతా మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.దళిత వర్గానికి చెందిన నాయకుడు అత్యున్నత స్థానంలో ఉండటం ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో,దళిత బహుజన సంఘాల భాగస్వామ్యంతో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని దోండి రమణ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా అని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.