దళిత స్పీకర్ పై అహంకార వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే..! ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యం లో అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ,బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సభాపతి స్థానంలో ఉన్న ఒక దళిత నాయకుడిని ఉద్దేశించి ఇష్టారీతిగా మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీకున్న దళిత వ్యతిరేక భావజాలానికి,అహంకారానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు.అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలను,రాజ్యాంగ విలువలను బీఆర్ఎస్ నేతలు కించపరుస్తున్నారని విమర్శించారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు...