బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం

బాల్కొండ: శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు గారు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు గారి దిష్టిబొమ్మతో పాటు, ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైన అత్యున్నత గౌరవనీయమైన పదవి. రాజకీయ భేదాలు ఉండవచ్చు.....