బాల్కొండ: బాల్కొండ మండల సర్వ సభ సమావేశంలో బాల్కొండ మండల సర్పంచులు కలసి బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం మండల అభివృద్ధి అధికారి కి మండల సర్పంచు లు విజ్ఞప్తి చేయాగ స్థానిక మండల విద్యాధికారిని ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు గురించి జీవోను జారీ చేశారని ఈ జివో ప్రకారంగా రాష్ట్రం లోని అన్ని నియోజక కేంద్రాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారని, ఇందులో భాగంగా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచూలు కోరారు.ఈ విషయంలో గతంలో ఉన్నత అధికారులకు విన్నవించామని బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్ తెలిపారు.స్కూల్ ఏర్పాటు గురించి ఆర్మూర్ సబ్ కలెక్టర్ బాల్కొండ లో ఉన్న జిల్లాపరిషద్ ఉన్నత పాఠశాల గదులను,ల్యాబ్ లను, ఓపెన్ గ్రౌండ్ను స్కూల్ ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూములను చూడాలని వారు విజ్ఞప్తి చేసారు. బాల్కొండలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయించాలని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జి. మోహన్ రెడ్డి అధికారుల్ని కోరారు.




