ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘంలో రాఖీ పౌర్ణమి వేడుకలు…

ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర గల మార్కండేయ మందిరం ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 8 తర్పల అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు సలహాదారులందరి సమక్షంలో పూజారి వేదమంత్రోచ్ఛరణల మధ్య యజ్ఞము,హోమము,యజ్ఞోపవీత ధరణ,పట్టణ అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డలు ఒకరికొకరు రక్షాబంధన్ (నేను నీకు తోడు నీవు నాకు తోడు మనమిద్దరం పద్మశాలి వంశ ప్రతిష్టకు తోడునీడగా ఉందామని...) చేసుకునే ఈ పవిత్రమైన దినాన్ని మార్కండేయ వంశ పరంపరలు సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీత (పవిత్రమైన దారపు పోగులు) ధారణ చేసుకుని పవిత్రతకు నాందిగా నియమనిష్టలకు...