ఆర్మూర్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో “జాతీయ చేనేత దినోత్సవము” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది చేనేత కార్మికులను ఇటీవల ఎన్నికైన నూతన చైర్మన్ చెన్న రవికుమార్,వైస్ చైర్మన్ బెన్కి గంగా మోహన్,డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ చెన్న రవికుమార్ మాట్లాడుతూ నాకు నా అనుభవంతో పరిచయాలతో చేనేత సహకార సంఘానికి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. చేనేతను ప్రేమిద్దాం…చేనేతను ప్రోత్సహిద్దాం…చేనేత కార్మికుడి చిరునవ్వే మన దేశం అభివృద్ధికి నిజమైన అలంకారం కావాలని కోరుతూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమ నిర్వాకులు ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ చేనేత అనేది కేవలం ఒక బుద్ధి కాదు అది భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి స్వావలంబనకు ప్రతీక అన్నారు.నూలు పోగులను అల్లుతూ జీవితాలను అందంగా తీర్చిదిద్దే,ప్రతీ చేనేత కార్మికుడి చేతుల్లో శ్రమ ఉంది. కళ ఉంది,దేశ గౌరవం ఉంది. వారి చెమట చుక్కలతో నేసిన ప్రతి వస్త్రం మన సంస్కృతికి సజీవ సాక్ష్యం.ఆధునిక యుగంలో యంత్రాల పోటీ ఎంత పెరిగినా,చేనేత వస్త్రాల ప్రత్యేకత,నాణ్యత,కణాత్మకత ఎప్పటికీ చెరగని విలువలతో పరిడవిల్లుతున్నాయన్నారు.
చేనేతను ఆదరించడం అంటే మన సంప్రదాయాన్ని,మన కళాకారులను,మన చేనేత కార్మికులను,మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమన్నారు. చేనేత కార్మికులకు,నూతనంగా ఎన్నుకోబడిన డైరెక్టర్లకు మార్కండేయ కండువాలు ధరింపజేసి,నూలుపోగుల దండను ఒక మాలగా పేర్చి వారి మెడలో వేసి,శాలువలతో
సన్మానించారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా జింధం నరహరి వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్,ఉపాధ్యక్షులు కట్కం నరేందర్,సహాయ కార్యదర్శి జింధం నరహరి,సర్వసమాజ్ ప్రతినిధి కొక్కుల (ఐడియా) విద్యా సాగర్,అధ్యక్షులు1వ తర్ప కృష్ణహరి,5వ తర్ప ఆడెపు ప్రభాకర్,7వ తర్ప సదుమస్తుల గణపతి,చేనేత కార్మికులు,డైరెక్టర్లు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




