ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీ, కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు,డి.ఈ ల ఆధ్వర్యంలో ప్రభుత్వపరంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత విశేషాలతో రూపొందించిన కరపత్రాన్ని,తెలంగాణ జాతిపితగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని పోస్టర్ను ఆవిష్కరించారు.ముఖ్య అతిథిగా,విశిష్ట అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు, డి.ఈ లు మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111 వ జన్మదినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా ఆర్మూర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ తొలి దశ,మలిదశ ఉద్యమాల పోరాటానికి స్ఫూర్తి ప్రదాత, నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట యోధుడుజాతీయ ఉద్యమ నాయకుడు,నిబద్ధత కలిగిన తెలంగాణ పోరాట యోధుడు,ఉద్యమానికి తన స్వంత జలదృశ్యాన్ని పార్టీ కార్యాలయానికి ఇచ్చి సర్వస్వం త్యాగం చేసిన త్యాగమూర్తి, చేనేత కార్మికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు… ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై క్యాబినెట్ మంత్రిగా పనిచేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలిసారి రాజీనామా చేసిన క్యాబినెట్ మంత్రి,బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మహోన్నత వ్యక్తిత్వం గల నాయకుడు,డిప్యూటీ స్పీకర్ గా పనిచేసి ముఖ్యమంత్రి పదవి తృటిలో చేజారిపోయిన మహాయోధుడు,97 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కొరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన యోధుడు.
తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పార్టీ పుస్తకాల్లో చేర్చాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రతీ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువెత్తు కాంస్య విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు.రాష్ట్ర రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విజ్ఞాన కేంద్రానికి 10 ఎకరాల భూమి ఇస్తూ, ఐదు కోట్ల నిధులు కేటాయించాలన్నారు.తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలన్నారు.సమన్వయకర్తగా జింధం నరహరి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్,స్థానిక కౌన్సిలర్ జగన్నాథ్ నాగేంద్ర, ప్రముఖ సీనియర్ నాయకులు గోనె దామోదర్,గుద్దేటి రమేష్,ఈ.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్,బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిల్క కిష్టయ్య,8 తర్పల అధ్యక్షులు హరికృష్ణ,అనంతరావు,చిట్ల యగ్నేష్,రుద్ర రాజేశ్వర్,ఆడెపు ప్రభాకర్,కురికెల్లి ఆత్మ చరణ్,సదుమస్తుల గణపతి,బండి రాజు,పట్టణ మాజీ అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొరకు చేసిన సేవలను కొనియాడారు.




