ఆర్మూర్ చేనేత సహకార సంఘంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో “జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు”…
ఆర్మూర్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో "జాతీయ చేనేత దినోత్సవము" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది చేనేత కార్మికులను ఇటీవల ఎన్నికైన నూతన చైర్మన్ చెన్న రవికుమార్,వైస్ చైర్మన్ బెన్కి గంగా మోహన్,డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ చెన్న రవికుమార్ మాట్లాడుతూ నాకు నా అనుభవంతో పరిచయాలతో చేనేత సహకార సంఘానికి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. చేనేతను ప్రేమిద్దాం...చేనేతను ప్రోత్సహిద్దాం...చేనేత కార్మికుడి చిరునవ్వే మన దేశం అభివృద్ధికి నిజమైన అలంకారం కావాలని కోరుతూ...