తిమ్మాపూర్: గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా తిమ్మాపూర్‌లో కేంద్ర ప్రభుత్వ ‘ఉల్లాస్’ (ULLAS – Nav Bharat Saksharta Karyakram) ఆధ్వర్యంలో నేడు అక్షరాస్యతా పరీక్ష నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మంది నిరక్షరాస్యులు ఉత్సాహంగా పరీక్షకు హాజరై తమ అక్షర ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ పుప్పాల నరేష్ స్వయంగా విచ్చేసి పరీక్షా సరళిని పరిశీలించారుఅభ్యర్థులను ఉత్సాహపరుస్తూ, వయసుతో సంబంధం లేకుండా నేర్చుకోవాలనే తపన అభినందనీయమని పేర్కొన్నారు.చదువుతోనే వ్యక్తిగత వికాసంతో పాటు సమాజంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సర్పంచ్ తెలిపారు.ఈ సందర్భంగా తాను ఒక న్యాయవాది అయినప్పటికీచదువు ద్వారా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, మీలాగే అందరూ అక్షరాస్యులు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీ మహేందర్ మహిళా CA అవంతి , వరలక్ష్మి,గంగామణి,రాణి మరియు విద్యా వాలంటీర్లు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షను విజయవంతం చేశారని తెలిపారు.ఈ సందర్భంగా సహకరించిన వారందరికీ సర్పంచ్ పుప్పాల నరేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
తిమ్మాపూర్‌లో ఘనంగా ‘ఉల్లాస్’ అక్షరాస్యతా పరీక్ష – ఉత్సాహంగా పాల్గొన్న 100 మంది…




