31.8 C
Hyderabad
Sunday, September 27, 2026

సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సట్ల ప్రవీణ్  అధ్యక్షతన పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు, కొత్తగా మంజూరు కానున్న అన్ని రకాల పింఛన్లు, గృహజ్యోతి తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచించడం జరిగింది.

అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులకు దగ్గరుండి దరఖాస్తులు నింపించడంతో పాటు, అవసరమైన పత్రాలు సక్రమంగా సమర్పించేలా సహకరించాలని సూచించారు.

బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.