Sunday, June 28, 2026

పునర్నిర్మాణ పనులకు సహకారాన్ని అందిస్తా…ఈరవత్రి అనిల్ హామీ

📰 Generate e-Paper Clip

బాల్కొండ: మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ హామీ ఇచ్చారు. శనివారం బాల్కొండ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘము సభ్యులు మండలం లోని కిసాన్ నగర్ గ్రామం లో ఈరవత్రి అనిల్ ని కలిసి ఆలయ విశిష్టతను వివరించారు. వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఆలయంలో బ్రహ్మసూత్ర శివలింగం భక్తుల తో పూజలు అందుకుంటున్నదదని పద్మశాలి సంఘం అధ్యక్షులు అందే వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్ లు ఈరవత్రి అనిల్ కి వివరించారు. గుడి పురాతన వైభవం , ప్రస్తుత ఆలయ స్థితిగతులు, నిర్మాణం గురుంచి సేకరించిన నమూనాల వివరాలను సేకరించామని అవసరమైన నిధులను మంజూరు చేయించాలని వారు ఈరవత్రి అనిల్ ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This