వేల్పూర్: పిసిసి అధ్యక్షునికి ఇచ్చిన సవాళ్లను మేము స్వీకరిస్తున్నాం మీరు డేటు టైమ్స్ ఫిక్స్ చేయండి మేము చర్చించడానికి సిద్ధంగా అని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ -మానాల మోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద విలేకర్లు సమావేశం ఏర్పాటు చేసి ఈసమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ -మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు పిసిసి అధ్యక్షునికి సవాల్ విసిరుతున్న నువ్వు నిజామాబాద్ కి రా మీరు రుణమాఫీ చేసిన బోనస్ ఇచ్చిన రైతులకు చేయాల్సిన మేలు ఏం చేసినా నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.మాట ఏదైతే ఉందొ ప్రశాంత్ రెడ్డి మాట్లాడింది ఆవశంలో మాట్లాడుతారు మరి కూర్చొని చర్చిద్దాం అంటే ముందుకు రావు పిసిసి అధ్యక్షునికి ఇచ్చిన సవాళ్లను మేము స్వీకరిస్తున్నాం మీరు డేటు టైమ్స్ ఫిక్స్ చేయండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.మీరు చెప్పిన మాటలకి పిసిసి ప్రెసిడెంట్ వరకు ఎందుకు ఈ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా మాట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను సూచించారు.కచ్చితంగా నువ్వు నిజాయితీగా నీకు నిబద్ధత ఉంటే మీ బాస్ కెసిఆర్ ఇచ్చినటువంటి హామీలు 10 సంవత్సరాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అప్పుడే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు దానికి రాజకీయం సన్యాసం తీసుకోవాలని ఎద్దవే చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు..



