Thursday, May 14, 2026

ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే ….

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ సాగర్: మెండోరా మండల కేంద్రంలోని పాత మార్కెట్ వద్ద తెలంగాణ సంక్షేమ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి మాట్లాడుతూ ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం.ఈ కార్యక్రమంలో మెండోర మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్, మహేందర్, నాగరాజు, బెనర్జీ,బిసి సంఘ నాయకులు నారాయణ, రాజు, శంకర్,భూమేశ్వర్, సురేందర్, భూమయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This