ఆర్మూర్: నందిపేట్ మండలంలో గత వేసవి కాలంలో 5 రోజులపాటు “కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం” కు సంబంధించిన ఎర్న్డ్ లీవ్లను విద్యాశాఖ అధికారి ఆదేశానుసారంగా మండల ఎంఈవో అవధూత గంగాధర్ ఈఎల్స్ ప్రొసీడింగును పీఆర్టీయు నాయకులకు అందజేశారు.మండలంలోని ఉపాధ్యాయులు ఈఎల్స్ మంజూరు చేయించినందుకు పీఆర్డీయు నాయకులు నందిపేట్ మండల అధ్యక్షులు భూషణ్, ప్రధాన కార్యదర్శి రమేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.


