మెండోరా మండల సీనియర్ అసిస్టెంట్ సాయగౌడ్ బుధవారం పదవీ విరమణ చేశారు.ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ,ఉద్యోగంలో చేరి సుదీర్ఘకాలంగా శాఖలో సేవలందించినందుకు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ శ్రీనివాస్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చారి,జూనియర్ అసిస్టెంట్ నాగరాజ్, లక్ష్మణ్, రెవెన్యూ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.



