Sunday, June 28, 2026

జీతాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన

📰 Generate e-Paper Clip

బాల్కొండ :బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాలో పనిచేస్తున్న లైన్‌మెన్‌లు, సిబ్బంది తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మిషన్ భగీరథ పంప్ హౌస్ గేట్ ముందు నిలబడి సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే బకాయిలు చెల్లించాలని వారు కోరారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని సిబ్బంది తెలిపారు. ఈ నిరసనలో సూపర్వైజర్ నాగరాజ్, విఘ్నేష్, నరేందర్, గంగాధర్, సుదీర్, సతీష్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This