25.2 C
Hyderabad
Monday, September 28, 2026

పోచంపాడ్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

టవేరా ఢీకొని వ్యక్తి మృతి.. రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులు
రహదారి విస్తరణ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్

మెండోరా:
పోచంపాడ్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం టవేరా వాహనం ఢీకొనడంతో దూదిగం గ్రామానికి చెందిన పసుల గంగారం (65) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
ప్రమాద ఘటనతో దూదిగం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న చౌరస్తా వద్ద రహదారిని వెడల్పు చేయాలని, లేదంటే ఫ్లైఓవర్ నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కలెక్టర్ సంఘటనా స్థలానికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. రాస్తారోకో కారణంగా పోచంపాడ్ చౌరస్తా నుంచి సుమారు 10 కిలోమీటర్ల టోల్ ప్లాజా వరకు, ఇటువైపుగా ముప్కాల్ బైపాస్ వైపు మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు స్థానికుల సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.