పోచంపాడ్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టవేరా ఢీకొని వ్యక్తి మృతి.. రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులు రహదారి విస్తరణ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ మెండోరా: పోచంపాడ్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం టవేరా వాహనం ఢీకొనడంతో దూదిగం గ్రామానికి చెందిన పసుల గంగారం (65) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాద ఘటనతో దూదిగం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న చౌరస్తా వద్ద రహదారిని వెడల్పు చేయాలని, లేదంటే ఫ్లైఓవర్ నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో...