31.9 C
Hyderabad
Friday, September 25, 2026

25 డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి విశ్వకర్మల ఏక్తా యాత్ర

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ : విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సమాజాన్ని జాతీయ స్థాయిలో ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు 25 జాతీయ డిమాండ్ల సాధన లక్ష్యంగా హైదరాబాద్‌ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి ఢిల్లీ వరకు 74 రోజుల పాటు 1,700 కిలోమీటర్ల మేర చేపట్టిన విశ్వకర్మ ఏక్తా యాత్ర శుక్రవారం బాల్కొండకు చేరుకుంది. విశ్వకర్మ నాలెడ్జ్‌ సెంటర్‌ చీఫ్‌, ఫౌండర్‌ బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ విశ్వకర్మ సమాజానికి జాతీయ సంక్షేమ, అభివృద్ధి కమిషన్‌, ప్రత్యేక కేంద్ర వ్యవస్థ, సామాజిక–ఆర్థిక–వృత్తి డేటాబేస్‌, నైపుణ్య–సాంప్రదాయ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయ వృత్తులను ఆధునిక సాంకేతికత, పరిశ్రమలు, మార్కెట్‌తో అనుసంధానించి ప్రతి కుటుంబానికి నైపుణ్యం, పరికరాలు, పెట్టుబడి, మార్కెట్‌, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమన్నారు.సమాజ అభివృద్ధికి యువ నాయకత్వం అవసరమని, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విశ్వకర్మ నాలెడ్జ్‌ సెంటర్‌ను “లీడర్స్‌ ఫ్యాక్టరీ”గా తీర్చిదిద్దుతున్నట్లు పుష్పగిరి తెలిపారు. సెప్టెంబర్‌ 17న ప్రారంభమైన యాత్ర నవంబర్‌ 29న ఢిల్లీలో ముగింపు సభతో ముగుస్తుందని, దేశవ్యాప్తంగా విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. బాల్కొండ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుంకం దినేష్‌, శ్రీపాద తుకారం, రవి, నరేష్‌, కోటగిరి అంజయ్య, లింబాద్రి, రాజు, మోహన్‌, మండాజి యోగేశ్వర్‌, హన్మాండ్లు, పిల్లేండ్ల శివప్రసాద్‌ తదితరులు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.