25 డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి విశ్వకర్మల ఏక్తా యాత్ర

బాల్కొండ : విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సమాజాన్ని జాతీయ స్థాయిలో ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు 25 జాతీయ డిమాండ్ల సాధన లక్ష్యంగా హైదరాబాద్‌ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి ఢిల్లీ వరకు 74 రోజుల పాటు 1,700 కిలోమీటర్ల మేర చేపట్టిన విశ్వకర్మ ఏక్తా యాత్ర శుక్రవారం బాల్కొండకు చేరుకుంది. విశ్వకర్మ నాలెడ్జ్‌ సెంటర్‌ చీఫ్‌, ఫౌండర్‌ బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ విశ్వకర్మ సమాజానికి జాతీయ సంక్షేమ, అభివృద్ధి కమిషన్‌, ప్రత్యేక కేంద్ర వ్యవస్థ, సామాజిక–ఆర్థిక–వృత్తి డేటాబేస్‌, నైపుణ్య–సాంప్రదాయ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయ వృత్తులను ఆధునిక సాంకేతికత, పరిశ్రమలు, మార్కెట్‌తో అనుసంధానించి ప్రతి కుటుంబానికి...