31.8 C
Hyderabad
Sunday, September 27, 2026

అంబటి రాంచందర్ సేవలు మరువలేనివి…

Must read

📰 Generate e-Paper Clip


వేల్పూర్ మండలంలోని పడగల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి రాం చందర్ “ఉద్యోగ విరమణ” సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని గురడి రెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి వెలిగించి ఆయన జీవిత విశేషాలతో రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన అక్షరాభిషేకం – జీవనతరంగాలు అనే కరపత్రాన్ని వేల్పూర్ మండల విద్యాశాఖాధికారి రేణుక ఆవిష్కరించారు.ఈ సన్మాన పత్రాన్ని జింధం నరహరి చదివి వినిపించారు.తర్వాత సభాధ్యక్షులు రేపటి (ఆగస్టు 1 ) నుండి ఎఫ్ఏసి హెడ్మాస్టర్ పెంట జలంధర్ తొలిపలుకుల్లో “ఉద్యోగ విరమణ” పొందుతున్న అంబటి రాంచందర్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడుగా విద్యారంగంలో ఎనలేని సేవలు చేశారని వారి సేవలను అభినందిస్తూ కొనియాడారు. విశిష్టఅతిథులు స్థానిక సర్పంచ్ నల్ల రాజు, ఉప సర్పంచ్ గైని నరేందర్ మాట్లాడుతూ రాంచందర్ సార్ మా పాఠశాలకు వచ్చిన నుండి పిల్లలు మంచి క్రమశిక్షణతో విద్యాబుద్దుల నేర్పారని విద్యార్థులకు అంకితభావంతో పనిచేసి పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఫలితాలలో ముందు వరుసలో నిలబెట్టారని గుర్తు చేశారు.మా అందరితో మమేకమై కలుపుగోలుగా ఉండేవారని, ఇలాంటి ఉపాధ్యాయులు చాలా అరుదుగా ఉంటారని పాఠశాల పై మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.

ముఖ్య అతిథులు వేల్పూర్ ఎంఈవో రేణుక బాల్కొండ ఎంఈవో రాజేశ్వర్ మాట్లాడుతూ అంబటి రాంచందర్ ఎక్కడ పనిచేసినా ముక్కుసూటి తత్వం, మొక్కవోని ధైర్యం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు, అవినీతి,అక్రమాలకు అతీతుడుగా విద్యా రంగంలో ఎనలేని సేవలందించారని ముప్కాల్ పోచంపాడ్ లలో పని చేసినప్పుడు విద్యార్థులను జాతి గర్వించే ఉత్తములుగా తీర్చిదిద్దారని త్రిబుల్ ఐటీ సాధనలో ఆయన గణిత శాస్త్రంలో 10/10 సాధించి దాదాపు 20 మంది విద్యార్థులకు త్రిబుల్ ఐటీ సాధించిన ఘనతగల ఉత్తమ ఉపాధ్యాయుడని ఆయన సేవలను కొనియాడారు.చివరగా సన్మాన గ్రహీత అంబటి రాంచందర్ మాట్లాడుతూ నేను చిన్నప్పటినుండి గురువుల ఆశీస్సులతో గణిత శాస్త్రం పై మక్కువ పెంచుకున్నానని ప్రైవేటు పాఠశాలలో పనిచేసే అపరమైన అనుభవాన్ని గడిచానని 35 వసంతాలుగా ఉద్యోగ ప్రస్థానంలో ఎందరెందరో విద్యార్థుల్ని గణితశాస్త్రంలో అగ్రగామిగా నిలబడడానికి నా వంతు ప్రయత్నించానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.నా మీద ప్రేమతో ఆహ్వానించగానే సన్మాన కార్యక్రమానికి వచ్చిన ఆత్మీయ బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా రిటైర్డ్ టీచర్ జింధం నరహరి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల హెడ్మాస్టర్లు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొని, శాలువాలు పూలమాలలతో సత్కరించి “ఉద్యోగ విరమణ” శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.