అంబటి రాంచందర్ సేవలు మరువలేనివి…

వేల్పూర్ మండలంలోని పడగల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి రాం చందర్ "ఉద్యోగ విరమణ" సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని గురడి రెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి వెలిగించి ఆయన జీవిత విశేషాలతో రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన అక్షరాభిషేకం - జీవనతరంగాలు అనే కరపత్రాన్ని వేల్పూర్ మండల విద్యాశాఖాధికారి రేణుక ఆవిష్కరించారు.ఈ సన్మాన పత్రాన్ని జింధం నరహరి చదివి వినిపించారు.తర్వాత సభాధ్యక్షులు రేపటి (ఆగస్టు 1 ) నుండి ఎఫ్ఏసి హెడ్మాస్టర్ పెంట జలంధర్ తొలిపలుకుల్లో "ఉద్యోగ విరమణ" పొందుతున్న అంబటి రాంచందర్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడుగా విద్యారంగంలో ఎనలేని సేవలు చేశారని...