Sunday, June 28, 2026

నేటి నుంచి భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో భూభారతి సేవలకు సంబంధించి యూజర్‌ చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం వివిధ సేవలకు వేర్వేరు రుసుములను నిర్ణయించింది.

🔹 15 పేజీల లోపు డాక్యుమెంట్లకు రూ.500 చార్జీ విధించగా, అదనపు పేజీలు ఉంటే గరిష్టంగా రూ.1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

🔹 చార్జీలు చెల్లించకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

🔹 ఇతర సేవల రుసుములు ఇలా ఉన్నాయి:

ఈసీ (Encumbrance Certificate) డౌన్‌లోడ్‌కు రూ.20 నుంచి రూ.100 వరకు

మ్యుటేషన్ కోసం ఎకరానికి రూ.2500 వరకు ఫీజు

పట్టాదార్ పాస్ పుస్తకానికి రూ.300

నాలా కన్వర్షన్‌కు కనీసం రూ.5000 ఫీజు

ఇదిలా ఉండగా, భూముల మార్కెట్ విలువల సవరణపై కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This