Monday, June 29, 2026

EV ద్విచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు

📰 Generate e-Paper Clip

మెండోర: మండలంలోని ప్రజలకు ముఖ్య సమాచారం. ఎస్సీ కార్పొరేషన్ నిజామాబాద్ కార్యనిర్వహక సంచాలకుల ఆదేశాల మేరకు EV ద్విచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలు తేది 02-05-2026 (శనివారం) ఉదయం 11.00 గంటలకు మెండోర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని ఆయన తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This