సామాజిక సేవలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయం
మెండోరా: మండల కేంద్రంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా సభ్యులు నాగరాజు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘ సభ్యులు ఆయన చేసిన సామాజిక సేవలను, తెలంగాణ ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. సమాజ అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు రమేష్, సంఘ సభ్యులు ధర్మేందర్, గంగాసాగర్,ముతేన్న తదితరులు పాల్గొన్నారు.




