26.7 C
Hyderabad
Tuesday, September 22, 2026

వినాయక మండపాలను సందర్శించిన మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సందర్శించి, విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇత్వర్‌పేట్, జలాల్‌పూర్, కిసాన్ నగర్, బాల్కొండ గ్రామాల్లోని పలు వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఇత్వర్‌పేట్, జలాల్‌పూర్‌లలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలతో పాటు, కిసాన్ నగర్ శివాలయం యూత్, బాల్కొండలోని AB యూత్, హిందూస్ పవర్ యూత్, మౌంటైన్ పవర్ యూత్, రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు మండపాలకు చందా అందజేశారు.మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ…
విఘ్నేశ్వరుడి ఆశీస్సులు, కృప రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, రైతులందరూ పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిమజ్జనం సమయంలో మండపాల నిర్వాహకులు మరియు యువత తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ , వెంకటేష్ గౌడ్ సర్పంచ్ మోహన్ రెడ్డి  సర్పంచ్ సంతోష్  ప్రవీణ్ గౌడ్ , కిషన్ , గంగాధర్ గారు, సంజీవ్ , వాజిద్ , రవి గారు, తౌడు గంగాధర్ , శ్రీను , కపిల్ , నగేష్ , యుసుఫ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.