వినాయక మండపాలను సందర్శించిన మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
బాల్కొండ: బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సందర్శించి, విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇత్వర్‌పేట్, జలాల్‌పూర్, కిసాన్ నగర్, బాల్కొండ గ్రామాల్లోని పలు వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఇత్వర్‌పేట్, జలాల్‌పూర్‌లలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలతో పాటు, కిసాన్ నగర్ శివాలయం యూత్, బాల్కొండలోని AB యూత్, హిందూస్ పవర్ యూత్, మౌంటైన్ పవర్ యూత్, రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు మండపాలకు చందా అందజేశారు.మానాల...