నిర్మల్: ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ–వెంకట్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు సతీష్, మదర్, సయేందర్, పంచాయతీ కార్యదర్శి, ఆశ వర్కర్స్,ఉపాధి హామీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన లక్ష్యాలు, గ్రామ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు.




