బాల్కొండ:బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకొని అనేక సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ మరియు సభ కార్యక్రమంలో TPCC spokes person సామ రామ్మోహన్ రెడ్డి DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి , బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు
కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత దొరకడం లేదని కబ్జాలకు కమిషన్లకు అలవాటు పడ్డ వ్యక్తికి నిజాయితీగా ఉండాలని చెప్తే కష్టమవుతుందని తెలిపారు. పది సంవత్సరాలు ఏలిన బిఆర్ఎస్ పార్టీ నియంతత్వాన్ని ప్రదర్శిస్తే ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛగా ప్రజలు తమ పనులు తాము చేసుకుంటున్నారని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం అమలు చేస్తున్న/ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాల గురించి వారు వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఇప్పటికే దాదాపు 12600 కోట్ల పై చిలుకు ప్రభుత్వం RTC కి కట్టిందని అన్నారు.
ఫ్లెక్సీ రూపంలో ప్రశాంత్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు ప్రదర్శన చేసిన కాంగ్రెస్
ఈ సందర్భంగా గత పది సంవత్సరాలు వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.




