బాల్కొండ: అటు రైతాంగాన్ని ఇటు విద్యుత్తు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాన్సఫార్మరుల ధ్వంసం , రాగి తీగల దొంగలను పోలీస్ లు ఎట్టకేలకు పట్టుకున్నారు . పోలీసుల వివరాల ప్రకారం, ఆర్మూర్‌కు చెందిన కర్రే వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంబోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, కర్తే విజయ్ కుమార్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి తదితరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, పగటి సమయంలో స్క్రాప్ కొనుగోలు చేస్తున్న నెపంతో గ్రామాల శివార్లలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించేవారు. అనంతరం రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను దొంగిలించి, ఆర్మూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబాకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు ఇందుకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 74 కిలోల రాగి తీగలు, ఒక బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సేల్ ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
నిందితులు వేల్పూర్, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, యెర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం 19 చోరీ కేసుల్లో పాల్గొన్నట్లు అయన తెలిపారు . పాత చోరీ సొత్తు కొనుగోలు కేసుల్లో కూడా అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబాపై గతంలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం పడగల్ గ్రామ శివారులోని పాత బీటీ రోడ్డుపై రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం ఆర్మూర్‌లో స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీంను కూడా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, విద్యుత్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, చోరీ సొత్తు కొనుగోలు చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా గ్రామంలోకి వస్తే వారిపైన నిఘా పెట్టాలేని తెలియజేశారు. గ్రామాలలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా గ్రామంలోకి వస్తే వారిపైన నిఘా పెట్టాలేని తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి శుభం నగరాలే, ఈ సందర్భంగా కేసులు చేదించిన పోలీసులను సిపి అభినందించారు. ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సీఐ జాన్ రెడ్డి, వేల్పూరు సబ్ ఇన్స్పెక్టర్ సాయి కిరణ్, బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ శైలేందర్ పాల్గొన్నారు.
పోలీసు లను అభినందించిన
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య
ఈ కేసుని చేదించుటలో ముఖ్య పాత్ర వహించిన ఆర్మూర్ రూరల్ సి ఐ జి.జాన్ రెడ్డి , వేల్పూర్, బాల్కొండ ఎస్ ఐ లు బి. సంజీవ్, కె.శైలెందర్ లతో పాటు కానిస్టేబుళ్ళు భారత్ గౌడ్ { మెండోర }
నరేంధర్, ( HC వేల్పూర్ ) హరీష్, ( ముప్కాల్ ) సాయి కిరణ్, ( వేల్పూర్) శ్రావణ్, ( వేల్పూర్) సుధర్శన్, ( HC వేల్పూర్ ) లను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య అభినందించినారు.




