పగలు వ్యాపారం … రాత్రి రాగి తీగల దొంగతనం …
బాల్కొండ: అటు రైతాంగాన్ని ఇటు విద్యుత్తు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాన్సఫార్మరుల ధ్వంసం , రాగి తీగల దొంగలను పోలీస్ లు ఎట్టకేలకు పట్టుకున్నారు . పోలీసుల వివరాల ప్రకారం, ఆర్మూర్‌కు చెందిన కర్రే వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంబోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, కర్తే విజయ్ కుమార్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి తదితరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, పగటి సమయంలో స్క్రాప్ కొనుగోలు చేస్తున్న నెపంతో గ్రామాల శివార్లలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించేవారు. అనంతరం రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను దొంగిలించి, ఆర్మూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి...