Sunday, June 28, 2026

డెడ్ బాడీ ఫ్రీజర్ వితరణ

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలం మోతె గ్రామంలో తన తండ్రి అల్లపుల్ల రాజులు జ్ఞాపకార్థంగా హైదరాబాద్ మాయాజూం ఫిలింస్ ఫిల్మ్ మేకర్ అల్లపుల్ల గంగారెడ్డి డెడ్ బాడీ ఫ్రీజర్ ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ ప్రంచాయితీ పాలక వర్గం సభ్యులకు సంయుక్తంగా మోతేలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకర్ గంగారెడ్డి మాట్లాడుతు, ఫ్రీజర్ లేకపోవడంతో వేరే ప్రాంతాలనుండి తెచ్చుకొని రావడం వలన గ్రామస్తులు వ్యయ ప్రయాసలకు ఖర్చులకు లోనవుతున్నారని. స్వయంగా గ్రామంలోనే ఉచితంగా, గ్రామస్తులందరికి ఉచితంగానే 24 గంటలు ఉపయోగపడుతుందనే సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందీ అన్నారు.ఈ కార్యక్రమలో సర్పంచ్ దొల్ల రమేశ్ రెడ్డి, ఉపసర్పంచ్ కర్రోల్ల పరంజ్యోతీ కుమార్,గ్రామ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన, వీడీసి స్పీకర్స్ ద్యాగ బంగారం, కల్ల రాజెందర్, వీడీసి సభ్యులు ,వార్డు మెంబర్స్, గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, వివిధ యువజన సభ్యులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This