Sunday, June 28, 2026

రాష్ట్రస్థాయి లో 6వ ర్యాంకు వేల్పూర్ అక్షర మోడల్ స్కూల్ విద్యార్థి.

📰 Generate e-Paper Clip

వేల్పూర్: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ఒలింపియాడ్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క) కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రాష్ట్ర స్థాయి అవార్డు విజేత

ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వేల్పూర్ మండలంలోని అక్షర మోడల్ స్కూల్ కు చెందిన  చైతన్య కృష్ణ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు.అతిథుల చేతుల మీదుగా చైతన్య కృష్ణ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లా స్థాయి విజేతలు జిల్లా స్థాయిలో రాణించిన పలువురు విద్యార్థులకు కూడా ఈ వేదికపై అవార్డులను అందజేశారు.విజేతల వేల్పూర్ అక్షర మోడల్ స్కూల్ విద్యార్థులు హర్ష వర్ధన్,లలిత్, విఘ్నేష్,యోగిత గణిత శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులకు మెమెంటోలు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈకార్యక్రమంలోఫౌండేషన్ ప్రతినిధులు,విద్యావేత్తలు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This