వేల్పూర్:ఆర్మూర్-జగిత్యాల రహదారిలోని వేల్పూర్ మండలం లక్కోర గ్రామ సమీపంలో గల ప్రమాదకర మలుపు వద్ద పోలీసులు’పోలీసు కటౌట్’ను ఏర్పాటు చేశారు.ప్రమాదాల నివారణకు ఎస్సైబి.సంజీవ్ ఆధ్వర్యంలోఈచర్యలు తీసుకున్నారు.ఈకటౌట్ చూడగానే డ్రైవర్లు అప్రమత్తమై వేగాన్ని నియంత్రించుకోవాలని ఆయన సూచించారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో మలుపుల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు.ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


