Sunday, June 28, 2026

చలి వేంద్రం ప్రారంభించిన సర్పంచ్

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ సాగర్:  మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోనీ కూడలి వద్ద శనివారం దూదిగాం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని సర్పంచ్ మహమ్మద్ హరుణ్ రషీద్ (బాబా) చలి వేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా చలి వేంద్రని ఏర్పాటు చేశామని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఎండల్లో ఎక్కువ తిరగవద్దని , వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హరీష్,రవి కుమార్,గంగాధర్,రమేష్,నిలిష్,మల్లేష్, గ్రామ సెక్రెటరీ భారత్ కుమార్,గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This