బాల్కొండ: విదేశీ సంస్కృతి కి దాసోహం అయ్యే జెంజి బ్యాచుకు విరుద్ధంగా యుగ యుగాల సనాతన వారసులమంటూ నేటి యువత హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకొంది. బాల్కొండ లోని దాస్ హనుమాన్ మందిరంలో ఆధ్వర్యంలో యువతీ యువకులు పెద్ద ఎత్తున జెండా ఊరేగింపును నిర్వహించారు. మార్కండేయ మందిరం నుండి దాస్ హనుమాన్ మందిరం వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది.


