Sunday, June 28, 2026

భళా! రేవంత్ రెడ్డి…మహాలక్ష్మి జర్నీతో 10000 కోట్లు … ఫ్రీ బస్సు నజరానా!!

📰 Generate e-Paper Clip

ఎన్ని విమర్శలు వచ్చినా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి ఫ్రీ బస్సు స్కీం… హిస్టరీ రికార్డ్ చేసింది. 2023 డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ స్కీంతో తెలంగాణ మహిళలు దాదాపు పదివేల కోట్లకు పైగా బస్సు చార్జీలను మిగిల్చుకున్నారు. రాష్ట్రంలో పేద, నిరుపేద , మధ్యతరగతి మహిళలు తమ అవసరాల రాకపోకలకు 1500-2500 రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో గత 28 నెలల నుండి ఇప్పటివరకు 290 కోట్ల ఫ్రీ బస్సు టికెట్లు ఆర్టీసీ జారీ చేసింది. ఈ ఖర్చు దాదాపు పదివేల కోట్ల రూపాయలు దాటినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ సర్వీసులో 80 శాతం ఫ్రీ బస్సు సర్వీసును మహిళలకు అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఏవరేజ్ గా ప్రతిరోజు మహిళలు దాదాపు 35 లక్షల మందికి పైగా మహాలక్ష్మి ఉచిత బస్ సర్వీసును వాడుకుంటున్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This