26.7 C
Hyderabad
Tuesday, September 22, 2026

పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించి మట్టి గణపతులను తయారు చేసిన విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండల కేంద్రం లోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ మరియు మదర్ థెరిసా హైస్కూల్ విద్యార్థులు పర్యావరణహిత మట్టి గణపతులను తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగుల వినియోగం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు స్వహస్తాలతో బంకమట్టితో వినూత్న గణనాథుల ప్రతిమలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్ రామలక్ష్మి తో పాటు ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామలక్ష్మి మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చిన్నతనం నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. హెచ్‌ఎంలు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు మాట్లాడుతూ, పండుగలను ప్రకృతికి హాని కలగకుండా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి జలవనరులను కాపాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తయారుచేసిన మట్టి ప్రతిమలను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.