పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించి మట్టి గణపతులను తయారు చేసిన విద్యార్థులు
బాల్కొండ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండల కేంద్రం లోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ మరియు మదర్ థెరిసా హైస్కూల్ విద్యార్థులు పర్యావరణహిత మట్టి గణపతులను తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగుల వినియోగం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు స్వహస్తాలతో బంకమట్టితో వినూత్న గణనాథుల ప్రతిమలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్ రామలక్ష్మి తో పాటు ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామలక్ష్మి మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చిన్నతనం నుంచే పిల్లల్లో పర్యావరణ...