Wednesday, June 10, 2026

నిజామాబాద్ జిల్లా నుండి జాతీయస్థాయి తైక్వాండ్ పోటీలకు ఎన్నికైన విద్యార్థులు…

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రం నుండి గద్వాల్ పట్టణంలో 15,16,17 తేదీలలో జరగబోతున్న ఓపెన్ జాతీయ తైక్వాండ్ పోటీలకు 14 మంది బాల బాలికలు ఎన్నికైనట్లు కరాటే భోజన్న తెలియజేశారు.రిషి వర్ధన్, హరీష్,భరత్,శశింద్ర, సునీత శివ సాయి, శ్రీ వర్ధన్,వంశీ, నక్షత్ర, వర్షిక,రిషికేష్,శ్రీనాథ్, చంద్రకాంత్, సాయి తేజ లు పాల్గొంటున్నారన్నారు.రెఫరీగా జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే భోజన్న వ్యవహరిస్తారు.ఈ కార్యక్రమాన్ని లయన్స్ ముఖ్య నేత డాక్టర్ మాదరి రాజన్న రిటైర్డ్ టీచర్ మాట్లాడుతూ వేసవిలో ఉచితంగా తైక్వాండో కరాటే శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తూనే ఆత్మ రక్షణకై విద్యార్థులకు చిన్ననాటి నుండి ఉచిత శిక్షణతో ప్రోత్సహిస్తున్న కరాటే భోజన్న సేవలను అభినందించారు.ఈ సందర్భంగా గద్వాల్ లో జరుగుతున్న ఓపెన్ జాతీయ తైక్వాండో పోటీలలో చేయడానికి జ్యూరీగా ఎన్నికైనారని తెలుపుటకు సంతోషిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This