ఆర్మూర్ లో స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు…
ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీ, కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు,డి.ఈ ల ఆధ్వర్యంలో ప్రభుత్వపరంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత విశేషాలతో రూపొందించిన కరపత్రాన్ని,తెలంగాణ జాతిపితగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని పోస్టర్ను ఆవిష్కరించారు.ముఖ్య అతిథిగా,విశిష్ట అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు, డి.ఈ లు మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111 వ జన్మదినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న...