ఆర్మూర్: సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈరోజు నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అనంతరం విలేకరులని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ అరాచక పాలన నుండి మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 రోజున స్వాతంత్ర్యం సిద్ధించిన దేశంలోని అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం మరియు కర్ణాటక లోని బీదర్ వరకు మహారాష్ట్రలోని నాందేడ్ వరకు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతూనే ఉంది.”జల్ జంగిల్ జమీన్ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం” అనే నినాదాలతో దొడ్డి కొమురయ్య,కొమురం భీం,చాకలి ఐలమ్మ,స్వామి రామానంద తీర్థ,సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి,షోయబుల్లాఖాన్,రామకృష్ణారావు బూర్గుల,ఆరుట్ల కమల భీమిరెడ్డి,నరసింహారెడ్డి,మల్లు స్వరాజ్యం,పుచ్చలపల్లి సుందరయ్య,ప్రభాకర్ రావు లాంటి ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాట యోధులు మరియుప్రజలు,యువకులు,రైతులు,రైతు కూలీల అలుపెరుగని వీరోచిత పోరాటం ఫలితంగా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం బలపడింది.నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రజాకార్ల నాయకుడు కాసిం రాజ్వి ప్రధాని లాయకలి ఏం చేయాలో దిక్కు లేని స్థితిలో ఉండగా ఉక్కుమనిషి భారతదేశ మొదటి హోం మంత్రి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ ప్రత్యేక చొరవతో ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ చర్య చేపట్టి నిజాం రజాకారులతో సైనిక చర్య ఫలితంగా నిజాం రాజు దిగివచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేసిన రోజు సెప్టెంబర్ 17 1948…అంటే నిజానికి దేశానికి స్వతంత్రం వచ్చిన కూడా మన ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 1948 రోజున ఈ దేశంలో సమైక్యం చెంది మువ్వన్నెల జెండా సగౌరవంగా ఎగిరింది…. తెలంగాణ ప్రజలకు భారత యూనియన్ తో సమైక్యత జరిగిన రోజు ఈ రోజు కాబట్టి ఈరోజును భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు బాలగంగాధర్స,సయ్యద్ హుస్సేన్బొ,బొడ్డు రాజశేఖర్,దారం సురేష్,కొత్తూరు భరత్,తాటికాయల సుభాష్, వార్డ్ మెంబర్ పాషా,దుబాయ్ శీను,పిప్పర శీను,విజయ్ సామ్రాట్,రాజేందర్,నాని,రొడ్డ మురళి,గాండ్ల సంతోష్,దర్శన్ రాజా గౌడ్,పిప్పర పెద్ద సాయన్న,ఆకుల సాయిలు,నరేష్,జైపాల్,భోగన్న, నాగరాజు, అశోక్, షబ్బీర్,వాజిద్, ఇర్ఫాన్, కిషన్,భోజన్న,దేవి దాస్,అశోక్,ప్రసాద్,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపిన అధ్యక్షులు మచ్చర్ల సాగర్…




