నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపిన అధ్యక్షులు మచ్చర్ల సాగర్…
ఆర్మూర్: సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈరోజు నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అనంతరం విలేకరులని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ అరాచక పాలన నుండి మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 రోజున స్వాతంత్ర్యం సిద్ధించిన దేశంలోని అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం మరియు కర్ణాటక లోని బీదర్ వరకు మహారాష్ట్రలోని నాందేడ్ వరకు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతూనే ఉంది."జల్ జంగిల్ జమీన్ భూమికోసం భుక్తి...