బాల్కొండ: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) రెసిడెన్షియల్ బాలుర/బాలికల పాఠశాల మరియు హాస్టల్‌ను మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) ఆర్. గంగామోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హాస్టల్ పరిసరాలు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం మెనూ ప్రకారం పౌష్టికాహారం, నాణ్యమైన భోజనం అందించాలని, తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే తరగతి గదులను సందర్శించి, విద్యాబోధన తీరుపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పంచాయతీ కార్యదర్శి మోహన్ మరియు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజేపీ బాల్కొండ హాస్టల్లో ఎంపీఓ ఆర్. గంగామోహన్ ఆకస్మిక తనిఖీ




